శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్స్ లో జరిగిన పి.ఆర్.కె చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలలో సీనియర్ నాయకుడె రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సంధర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని, మహిళలందరికి అంతర్జాతీయ మహిళ దినోత్సవం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని, మహిళల కోసం సంస్కృతిక ప్రదర్శనలు, నిరుపేద మహిళలకు చీరల పంపిణీ వంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. మహిళ లు వంటింటికె పరిమితం కాకుండా అంది వచ్చిన అవకాశాలను పునికిపుచ్చుకొని అన్ని రంగాలలో ప్రావీణ్యం సాధించి ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని, ఆర్థిక స్వాలంబన పొందాలని, పురుషులతో సమానంగా పోటీ పడాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.