నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు డివిజన్ పరిధిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ తండాలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పర్యటించారు. బస్తీలో ఏర్పడిన విద్యుత్ సమస్యను సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ నాయక్, ట్రాన్స్ కో ఏఈ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
