సహస్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కార్పొరేట్ కార్యాలయం ప్రారంభం – హాజరైన ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గాంధీ, క్రాంతి కిరణ్

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని, కేసీఆర్ ప్రభుత్వ విధానాలతో బిల్డర్స్ కు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. బుధవారం మియాపూర్ లో సహస్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తో కలిసి ఎంపీ బీబీ పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

సహస్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ బీబీ పాటిల్

ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, వ్యాపార వర్గాలకు కావాల్సిన సహకారం అందిస్తుండడంతో పాటు టీఎస్ బీపాస్ లాంటి సరికొత్త విధానాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుందని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలతో తెలంగాణ సర్కారు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. సహస్ర బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చైర్మెన్ కోస్గి శంకర్ మరిన్ని మంచి ప్రాజెక్టులను వినియోగదారులకు అందుబాటులో తేవాలని, అన్ని ప్రాజెక్టులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.జగదీశ్వర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండా విజయ్ కుమార్, శివకుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, సహస్ర గ్రూప్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు గాంధీ, క్రాంతికిరణ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here