నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ ఉద్యమ నాయకుడు గజ్జల నగేష్, రాష్ట్ర టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ చైర్మన్ పటిమీడి జగన్ మోహన్ రావు లకు తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య, రంగారెడ్డి జిల్లా జాయింట్ సెక్రెటరీ వీరేష్, కోకాకోలా కంపెనీ జనరల్ సెక్రటరీ స్వామి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
