నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో గల ఓపెన్ డ్రైనేజీ లో, మురికి కాలువలలో దోమల నివారణ కోసం సోమవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఏంటమాలజీ సిబ్బందితో స్ప్రే చేయించారు. కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ మురికి కాలువలు దోమలకు నిలయాలుగా మారుతాయని ఎప్పటికప్పుడు వాటి నివారణకు స్ప్రే చేయాలని ఎంటమాలజీ సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరు ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే విష జ్వరాల నుండి జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, ఎంటమాలజీ ఏఈ కిరణ్ రెడ్డి, నాయకులు ఆంజనేయులు, పట్లోళ్ల నర్సింహారెడ్డి, రాజు నాయక్, రవి నాయక్, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.