నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో సగర (ఉప్పర) సంఘం నూతన కార్యాలయాన్ని బుధవారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగర సంఘం అభివృద్ధి, సంక్షేమం కోసం భవిష్యత్ తరాలకు శేరిలింగంపల్లి సగర సంఘం ప్రాంతీయ కార్యాలయం సాగర సోదరీ సోదరీమణులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సాగర సంఘం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సహకారంతో శేరిలింగంపల్లిలో ప్రాంతీయ సాగర సంఘం కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం సాగరులకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సగర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు రవి సగర, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ సతీష్ సగర, స్థానిక సగర సంఘం అధ్యక్షుడు వెంకటేష్ సగర, కార్యదర్శి కాశిం సగర, అంజయ్య నగర్ సగర సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సగర, కొండాపూర్ సగర సంఘం అధ్యక్షులు అశోక్ సగర, బుచ్చయ్య సగర, శేరిలింగంపల్లి సగర సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.