శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గచ్చిబౌలి స్టేడియంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన 5K , 10K, 21K రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో IT, పరిశ్రమ, వాణిజ్యం, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ సేవా భారతి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో 5K , 10K, 21K రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అని అన్నారు. పెద్ద సంఖ్యలో పాల్గొనడం అభినందనీయం అని అన్నారు. బాలికలను సంరక్షించాలని, బాలికల రక్షణనే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు. బాలికల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళ సాధికారికత సాధించాలని, మహిళల పట్ల వివక్ష నశించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహకురాలు బాల లత, సేవా భారతి నిర్వాహకులు ఉష, సునీత తదితరులు పాల్గొన్నారు.