శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): మాతృశ్రీ వాలీబాల్ ప్రీమియర్ లీగ్ -2025 ని మాతృశ్రీ నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. వరుసగా ఇది 5వ సంవత్సరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు భూపాలరెడ్డి, లక్ష్మణ్, రామకృష్ణంరాజు, గణపతి, ఉమా మనోహరరెడ్డి తెలిపారు. మొత్తం 10 టీం లు పాల్గొన్నారు. కిష్టిపాటి రవీంద్ర రెడ్డి టీం MVPL-2025 విజేతగా నిలవగా, హిమప్రసాద్ టీం రన్నరప్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో వి. జగదీశ్వర్ గౌడ్ పాల్గొని విజేతలకు బహుమతులు ఇచ్చి క్రీడాకారులను, నిర్వాహకులను అభినందించారు.