శేరిలింగంపల్లి, అక్టోబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శ్రీ ధర్మపురి క్షేత్రం నూతన రహదారిని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుడు అయిన గుణంపల్లి రాఘవ రెడ్డి చేతుల మీదుగా అమ్మవారి ఊరేగింపు సహితంగా ప్రారంభోత్సవం చేశారు.
అఖండ దీపారాధన జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారిని ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమం గొట్టిపాటి శ్రీనివాస్, అట్లూరి సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగింది. అమ్మవారు త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు.
శ్రీ చక్ర పూజలతో, కుంకుమార్చనలతో, హోమాలతో అభిషేకాలతో అమ్మవారి శరన్నవరాత్రులలో మొదటిరోజు సాయంకాలం స్వరరాగ మ్యూజిక్ అకాడమీ చిన్నారుల సంగీతంతో ఎంతగానో అలరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు.