శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ హుడా ట్రేడ్ సెంటర్ కాలనీలో కంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్లేశ్ తో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలనీ లోనీ గర్భిణీలు, వృద్దులు కనీసం నడవటానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు, సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్ పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రాజాయాదవ్, వనం నాగరాజు, పాశం రాజు, పాశం రాజ్ కుమార్, చిన్నబాబు, రంజిత్, వెంకట రమణ, శేషు, మహేష్, శ్రీధర్, SG టవర్స్ ప్రతినిధులు, శ్రీ గంగా ఫార్చ్యూన్ ప్రతినిధులు,,LVU అపార్ట్మెంట్ ప్రతినిధులు, సాయి సద్గురు అపార్ట్మెంట్ వాసులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.