శేరిలింగంపల్లి, నవంబర్ 13 (నమస్తే శేరిలింగంపల్లి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేపథ్యంలో మియాపూర్ లోని నాగార్జున ఎన్‌క్లేవ్ కాలనీలో ఉన్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఇంటి వద్ద డీసీ మోహన్ రెడ్డి, GHMC అధికారులు కలిసి వివరాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సర్వేను చేపడుతుందని అన్నారు. దీని వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అందరూ సర్వేకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు వైద్య అధికారి రవి, శానిటేషన్ సూపర్ వైజర్ శ్రీనివాస్, ఎస్ఆర్‌పి, కనకరాజు, ఎస్ఎఫ్ఐ లు వినయ్, అగమ్య తదితరులు పాల్గొన్నారు.