చికిత్స కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆర్ కే వై ఫౌండేషన్ సేవలందిస్తూ పేదలకు అన్ని విధాల అండగా నిలవడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ అన్నారు. కొండాపూర్ శ్రీరామ్ నగర్ కు చెందిన వెంకట్రాజు కుమారుడు వినోద్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స చేయించుకునే స్థితిలో లేరనే విషయాన్ని తెలుసుకున్న ఆర్ కే వై ఫౌండేషన్ నిర్వాహకులు రవికుమార్ యాదవ్ ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకు వచ్చారు. యశోద ఆస్పత్రిలో లక్ష రూపాయల ఖర్చుతో ఆపరేషన్ చేయించారు. ఆపదలో అండగా నిలిచిన రవికుమార్ యాదవ్ కు వినోద్ తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here