నమస్తే శేరిలింగంపల్లి: క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అదిరోహించాలని ఆర్ కే వై ఫౌండేషన్ సభ్యులు అన్నారు. మియాపూర్, హైదర్ నగర్, శంశి గూడ, ఎల్లమ్మ బండ, వెంకటేశ్వర నగర్ ప్రభుత్వ పాఠశాలలలో పదో తరగతి విద్యార్థులకు ఆర్ కే వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీమెటీరియల్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని, విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆర్ కే వై ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థినీ, విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ఆర్ కే వై పౌండేషన్ ద్వారా ప్రథమ, ద్వితీయ ప్రోత్సాహక బహుమతులు ఉంటాయని సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు, సీతారామ రాజు, నర్సింగ్ యాదవ్, లక్ష్మారెడ్డి, శ్రీహరి యాదవ్, నర్సింగ్ రావు , శ్రీధర్ గౌడ్ , పృథ్వి, తోట్ల భరత్, గణేష్ ముదిరాజ్, ఆంజనేయులు, వినోద్ యాదవ్, జె శ్రీను, రాము, రాఘవేంద్ర, యాది, గోవర్ధన్ చారి, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు.