ర‌వికుమార్ యాద‌వ్(ఆర్‌కేవై) ప్రాణ‌హేతు ఆద్వ‌ర్యంలో నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ర‌వికుమార్ యాద‌వ్‌(ఆర్‌కేవై) ప్రాణ‌హేతు ఆధ్వర్యంలో శ‌నివారం మియాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువులు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌కేవై ప్రాణ‌హేతు ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి గుండె గ‌ణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ ఒక‌వైపు క‌రోనా విజృంభ‌న‌, మ‌రోవైపు లాక్‌డౌన్ నిర్భందంతో ఉపాధి కోల్పోయి ఎందరో నిరుపేద‌లు తిండికి నోచుకోక అవ‌స్థ‌లు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాంటి వారి క‌డుపు నింపేందుకు త‌మ వంతు భాద్య‌త‌గా ఆర్‌కేవై ప్రాణ‌హేతు ద్వారా డివిజ‌న్ ప‌రిధిలో 300 కుటుంబాల‌కు బియ్యం, ప‌ప్పు, ఉప్పు, కారంల‌తో కూడిన కిట్‌ల‌ను అంద‌జేశామ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆర్‌కేవై ప్రాణ‌హెతూ బృంద స‌భ్యులు సారా రవీందర్ జేజరావు, శ్రీను, లక్ష్మణ్ ముదిరాజ్, జేజరావు, రాము, రేపాన్ వెంకటేష్,శ్రీధర్, చంద్ర మసిరెడ్డి, సోను కుమార్ యాదవ్, గోపి, శివ, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ను అందజేస్తున్న ఆర్‌కేవై ప్రాణ‌హేతు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుండె గ‌ణేష్ ముదిరాజ్ త‌దిత‌రులు
Advertisement

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here