నమస్తే శేరిలింగంపల్లి: సూపర్‌స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్‌లోని వివిధ దుఖాణాల యజమానులకు శనివారం జీహెచ్ఎంసీ ఎస్ఎఫ్ఏలు భిక్షపతి గౌడ్, నాగేశప్పలు కూపన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ గౌరవాధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, నాయకులు జనార్ధన్ గౌడ్, ప్రముఖ వ్యాపారి నూకల కైలాష్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలో సూపర్ స్ప్రెడర్స్ వ్యాక్సినేషన్ ప్రారంభించి, నిజమైన అర్హులకు టీకా ఇవ్వడం అభినందనీయమని అన్నారు. సూపర్ స్ప్రెడర్స్ కేటగిరిలోకి వచ్చే రైతుబజార్లు, కూరగాయల మార్కెట్లు, పూలు, పండ్లు, మాంసం, కిరాణా, మధ్యం, దుఖాణదారులు, వీధి వ్యాపారులు, పాన్‌షాప్, చాకలి, మంగలి కులవృత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
