శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్, ప్రేమ్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ హరిశ్చంద్ర హిందూ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని వివేకానంద నగర్ లోని తన నివాసంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపైPAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మార్తాండ్ నగర్, ప్రేమ్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీలో స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని, ప్రహరి గోడ ను నిర్మించాలని, మంచి నీటి వసతి కోసం బోర్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, విద్యుత్ సౌకర్యం కల్పిస్తూ వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, బర్నింగ్ ఫ్లాట్ ఫార్మ్ లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ మార్తాండ్ నగర్, ప్రేమ్ నగర్ లో ఉన్న శ్రీ హరిశ్చంద్ర హిందూ స్మశాన వాటిక ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, స్మశాన వాటిక లో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు. కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీ హరిశ్చంద్ర హిందూ స్మశాన వాటిక ప్రెసిడెంట్ శ్రీనివాస్ చౌదరి ,వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, జనరల్ సెక్రెటరీ సంతోష్, ట్రెజరర్ రాజు, రమేష్ పటేల్, వెంకటేశ్వర రావు, కట్ట శ్రీనివాస్, యాదగిరి, దామోదర్, మహేందర్, ప్రభాకర్ , శివ ,రాజేష్, రమేష్ , సతీష్, బాలు, వీరభద్ర రెడ్డి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.