సుందరీకరణతో చెరువులకు పూర్వ వైభవం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జూలై 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చెరువులు మురుగు నీటితో కలుషితం కాకుండా పరిరక్షిస్తామని శుద్ధ జలాలతో ఉండేలా చర్యలు చేపడతామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ప్రత్యేక ఛానళ్ల ద్వారా మురుగు నీటిని దారి మళ్లిస్తామన్నారు. శేరిలింగంపల్లి డివిజన్‌ పరిధిలోని గోపి చెరువు, చాకలి చెరువులను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు గోపిచెరువు, చాకలి చెరువులోకి చేరుతుండటంతో కలుషితం అవుతున్నందున యుద్ధప్రాతిపదికన పరిశుభ్రత చర్యలు చేపడతామన్నారు. ప్రత్యేక డైవర్షన్‌ ఛానళ్లను ఏర్పాటు చేసి మురుగునీరు చేరకుండా చూస్తామని, అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. చెరువులను సుందరీకరించి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు డిఈ నళిని, ఏఈ శశాంక్, మాజీ కౌన్సిలర్ సోమదాస్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, గోపినగర్ బస్తీ అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ఆదర్శ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, శ్రీకాంత్ దేవులపల్లి, గఫర్, వెంకట చారి, శివయ్య, సత్యనారాయణ, నర్సింహా, కృష్ణ, ఖాదర్, షైబాజ్, సాయి, ఆనంద్, ముజ్జు, స్వరూప, దీప, వీణ, రాణి, స్వరూప, వాక్షయిని, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here