నిజాంపేట్ (నమస్తే శేరిలింగంపల్లి): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ స్వతంత్ర కార్పొరేటర్లు ప్రగతి నగర్ అంబీర్ చెరువు సుందరీకరణ, అభివృద్ధిపై ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రగతినగర్ లోని అంబీర్ చెరువు సుందరీకరణ పనులు చేపట్టాలని, చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలని కోరారు. ఇందుకు గాంధీ స్పందిస్తూ త్వరలోనే సంబంధిత అధికారులతో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే చెరువు సుందరీకరణ పనులను సైతం చేపడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంకట్రామయ్య, ఆర్. శ్రీరాములు, సత్యవాణి, పైడి మాధవి, సుజాత, లక్ష్మీ కుమారి పాల్గొన్నారు.
