శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరుతూ యాదవ రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో నాయకుడు సూరజ్ మండల్ యాదవ్‌కు పలువురు యాదవ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వట్టే జానయ్య యాదవ్, యాదవ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర గౌరవ సలహాదారు బేరి రామచంద్ర యాదవ్, యాదవ రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బడుగుల నాగార్జున యాదవ్, దాసరి నగేష్ యాదవ్, కేశ బోయిన మల్లయ్య యాదవ్, సాయన్న ముదిరాజ్ పాల్గొన్నారు.