శేరిలింగంపల్లి, మార్చి 5 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC ప్రధాన కార్యాలయం లో GHMC CE భాస్కర్ రెడ్డిని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రోడ్లు, లింక్ రోడ్ల నిర్మాణం పనులకు నిధులు మంజూరు చేయాలని, నాలాల విస్తరణ పనులకు నిధులు మంజూరు అయ్యేలా చూడాలని, గంగారాం చెరువు అలుగు నుండి శంకర్ నగర్ వరకు నాలా విస్తరణ పనులు చేపట్టాలని, బక్షి కుంట చెరువు అలుగు నుండి భవాని పురం నాలా పనులు చేపట్టాలని అన్నారు.
కాజా గూడ పెద్ద చెరువు నుండి ఎల్లమ్మ చెరువు వరకు వయా సాయి వైభవ్ కాలనీ నాలా విస్తరణ పనులు త్వరితగతిన పూర్తయేలా చర్యలు తీసుకోవాలని, ప్రజా అవసరాల దృష్ట్యా ప్రథమ ప్రధాన్యతగా తీసుకొని నాలా విస్తరణ పనులు చేపట్టాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని తెలియచేశారు. దీనికి GHMC CE భాస్కర్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగిందని, వెంటనే నాలా విస్తరణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలియచేసారు.