శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేటలోని సుభాష్ చంద్రబోస్ నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని కొందరు చేపడుతున్న ఐరన్ ఫినిషింగ్ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు ఆరేపల్లి సాంబశివ గౌడ్ గురువారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీ దర్గా నుంచి విజ్ఞాన్ కాలేజీ వరకు రోడ్డు ఉందన్నారు.
సైబర్ విలేజ్, సైబర్ వ్యాలీ, కృష్ణా నగర్ కాలనీ, ఆదిత్య నగర్ కాలనీ వాసులు కూడా తమ కాలనీ ప్రధాన రహదారిని ఉపయోగిస్తున్నారని అన్నారు. అలాంటి రహదారికి ఆనుకుని ఐరన్ ఫినిషింగ్‌ను ఏర్పాటు చేశారని, దీనిపై ప్రశ్నిస్తే జీహెచ్ఎంసీ అనుమతితోనే ఇలా నిర్మిస్తున్నామని చెబుతున్నారని, వారు అలా నిర్మాణం చేపట్టడం వల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని, కనుక ఆ నిర్మాణం చేపట్టేవారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.