శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్, చందానగర్ సర్కిల్ పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీలలో నాసిరకం సిసి రోడ్లను నిర్మించిన విషయమై GHMC ఇంజనీరింగ్ క్వాలిటీ విభాగం అధికారులు SE అశోక్ రెడ్డి, EE ఇందిరా బాయ్, శేరిలింగంపల్లి DE వినయ్ దత్, చందానగర్ DE రమేష్ లతో వివేకానంద నగర్ లోని కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలోని పలు డివిజన్లలోని కాలనీల్లో నాసిరకం రోడ్లను నిర్మించడం బాధాకరమన్నారు. నాసిరకంగా రోడ్లను నిర్మించడం వల్ల రోడ్లు వేసిన 6 నెలల్లోనే దెబ్బ తింటున్నాయని, దీంతో ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని అన్నారు. నాసిరకం పనులు చేసే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని అన్నారు. అధికారులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం క్వాలిటీ విభాగం అధికారులు SE అశోక్ రెడ్డి, EE ఇందిరా బాయ్, శేరిలింగంపల్లి DE వినయ్ దత్ , చందానగర్ DE రమేష్ , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.