శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆలయ పూజారిచే త్రివర్ణ పతాకాన్ని అర్చించి, హారతి ఇచ్చిన అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గంట సేపు అన్నమాచార్య భావనా వాహిని శిష్యులు హాసిని, సుప్రియ, అక్షయ్, సాయి తేజస్విని, వైష్ణవి సంయుక్తంగా శోభారాజు సంగీతం సమకూర్చిన జయపతాకమునెత్తరా అనే దేశ భక్తి గీతాన్ని, హరియవతారమితడు అన్నమయ్య, మరి కొన్ని దేశ భక్తి గీతాలను ఆలపించారు. చివరిగా విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి కార్యక్రమాన్ని ముగించారు.






