మియాపూర్ డివిజన్ పరిధిలోని ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరంగపురం, నడిగడ్డ తాండ, సుభాష్ చంద్రబోస్ నగర్, శ్రీల గార్డెన్, శ్రీ లక్ష్మీ నగర్, కృషి నగర్, M A నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంత్ నగర్, A S రాజు నగర్, కె కె ఎన్‌క్లేవ్ కాలనీలలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండారు మోహన్ ముదిరాజ్ , మర్రపు గంగాధర్ రావు , అన్వర్ షరీఫ్ , కాలనీ పెద్దలు, యువత, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here