శేరిలింగంపల్లి, జనవరి 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని GHMC జోనల్ కార్యలయంలో గణతంత్ర దినోత్సవంను పురస్కరించుకుని ఏర్పాటుచేసిన జాతీయ జెండాను జోనల్ కమీషనర్ హేమంత్ భోర్కడే తో తదితర డివిజన్ల కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, జిహెచ్ఎంసి సంబంధిత అధికారులు, పురప్రముఖులతో కలిసి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆవిష్కరించి గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ వార్డు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.

అనంతరం సుదర్శన్ నగర్ కాలనీ కమిటీ హాల్, సుదర్శన్ నగర్ రోడ్డు నెం. 4, గోపినగర్, ఆదర్శ్ నగర్ రోడ్డు నం 2, ఆదర్శ్ నగర్ కమిటీ హాల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హుడా ట్రేడ్ సెంటర్, రామయ్య నగర్ కాలనీ, లింగంపల్లి బోరింగ్, లింగంపల్లి విలేజ్ అర్చ్, జయశంకర్ సర్కిల్, పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, ఎంపీపీఎస్ సురభి కాలనీ, ఆర్జికే అంబేద్కర్ సెంటర్, ఆదర్శ్ నగర్ రోడ్డు నెం. 3, బాపునగర్ హనుమాన్ యూత్, ఇందిరా నగర్, గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్ లలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ , రాష్ట్ర యువజన నాయకుడు రాగం అనిరుధ్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, పలువురు అధికారులు, యువ నాయకులు, బస్తీ కమిటీ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్లు, మహిళా నాయకురాళ్లు, కాలనీ అసోసియేషన్ అనుబంధ సంఘ ప్రతినిధులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.





