శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు చోట్ల రహదారుల పక్కన అక్రమంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్రోచ్‌మెంట్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. మియాపూర్ మెట్రో నుంచి మియాపూర్ ఎక్స్ రోడ్డు వరకు, బాచుపల్లి రోడ్డులో, ఆల్విన్ రోడ్డులో రహదారి పక్కన ఫుట్‌పాత్‌పై ఏర్పాటు చేసిన నిర్మాణాలను తొలగించారు. ఆయా రహదారుల్లో వాహనదారులకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.