శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): మేయర్ గద్వాల విజయలక్ష్మిని జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. మియాపూర్ డివిజన్‌లో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై మేయర్ గద్వాల విజయలక్ష్మిని ఆమె నివాసంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మర్యాద పూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ తోడ్పాటు అందించాలని కోరారు. నానాటికి మియాపూర్ డివిజన్ లో కాలనీలు విస్తరిస్తున్నందున డ్రైనేజీ, తాగునీటి విస్తరణ , వీధి దీపాల ఏర్పాటు, సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణం పరంగా సహకరించాలని కోరారు. శేరిలింగపల్లి నియోజకవర్గంలో PAC ఛైర్మెన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.