6 ఏండ్లలో 66 సార్లు పరిశీలించినా… అర కిలోమీటర్ నాలా పూర్తికాలేదు… రేగులకుంటను సందర్శించిన బిజెపి నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజాప్రతినిధులు ఫోటోలకు ఫోజులివ్వడమే చేసిన అభివృద్ధి శూన్యమని బిజెపి నాయకులు ఆరోపించారు. చందానగర్ డివిజన్ దీప్తి శ్రీ నగర్ లోని నాలాలను, రేగుల‌కుంట చెరువును బిజెపి సీనియర్ నాయకులు నాగులు గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నాయకులు గజ్జల యోగానంద్, మువ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, నరేష్, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుపాకీ రాముడు మాటలు చెప్తూ, ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఫేసుబుక్ లో రాతలు తప్ప చేసిన పనులకు దాఖలాలు లేవన్నారు. 6 సంవత్సరాలలో 66 సార్లు నాలాలను పరిశీలించానని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధి అర కిలోమీటర్ నాలా కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.

చందానగర్ డివిజన్ లో పర్యటిస్తున్న బిజెపి నాయకులు

నాలాల పనులు ఇప్పటి వరకు ఎన్ని పూర్తి చేశారని, దీప్తి శ్రీ నగర్ నాలా ఎప్పుడు మొదలుపెట్టారో, ఎప్పుడు పూర్తి చేస్తారో సమాధానం ఇవ్వాలన్నారు. కోట్లాది రూపాయలతో చెరువులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రజాప్రతినిధి రేగుల‌ కుంటలోని వేలాది చేపలు చనిపోయి మత్స్యకారులు లక్షలాది రూపాయలు నష్టపోయిన ఘటనకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. స్థానిక కార్పొరేటర్ హామీ మేరకు మత్సకారులకు ఎంత నష్టపరిహారం ఎంత, ఎప్పుడు ఇస్తారన్నారు. రేగులకుంట చెరువులో డంప్ యార్డ్ నుండి వచ్చే మురికి నీరు, అపార్ట్మెంట్ల నుండి వచ్చే మురుగు నీరు ద్వారా చేపలు చనిపోయిన విషయం వాస్తవం‌ కాదా అని ప్రశ్నించారు. ప్రతి రోజు కోట్లాది రూపాయలతో చెరువుల అభివృద్ధి అని చెప్పుకుంటున్న పాలకులు మురుగు నీరు చెరువులోకి రాకుండా నిలువరించలేక పోవడం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి సింధు రెడ్డి, ఎల్లేశ్, వెలగ శ్రీనివాస్, బిజెపి నాయకులు రాకేష్ దూబె, నరేందర్ రెడ్డి, రాజశేఖర్, లలిత, శ్రీనివాస్, శివ కుమార్ వర్మ, షైఫుల్లాఖాన్, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, లక్ష్మీ, కళ్యాణ్, హరికృష్ణ, సాయి మురళి, నాగరాజు, శ్రీధర్ గౌడ్, కసిరెడ్డి రఘునాథ్ రెడ్డి, చంద్రమౌళి, ఏకాంత్ గౌడ్, జంగయ్య, శ్రీనివాస్ ముదిరాజ్, శివరత్నాకర్, వినోద్, గణేష్, బాబు, జె. శ్రీను, రాము, విజయ్, కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.

రేగులకుంట చెరువు వద్ద మాట్లాడుతున్న బిజెపి నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here