నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్ మెంట్ లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. జనప్రియ అపార్ట్ మెంట్స్ లోని సాయిబాబా మందిరంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో టీఆర్ఎస్ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ మెంబర్ వెంకటేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమి రోజున సద్గురు సాయినాథున్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జన ప్రియా అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, గవాస్కర్, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్, అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు.