బొటానిక‌ల్ గార్డెన్‌లో వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీ ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్ నగరంలో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్‌లో సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన ఎకోటూరిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొందేం వీరయ్య, MBC చైర్మన్ జేరిపేటి జైపాల్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బొటానికల్ గార్డెన్ లో 75 వనాలతో కొత్తగా రూపుదిద్దుకున్న వృక్ష పరిచయ క్షేత్రాన్ని, కొత్తగా ఏర్పాటు చేసిన వర్చువల్ వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, పరిసర ప్రాంత కాలనీ వాసులకు, వాకింగ్ కోసం వచ్చే వారికి, సేద తిరడానికి వచ్చే వృద్దులకు, ఆటవిడుపు కోసం వచ్చే పిల్లలకు ఎంతగానో తోడ్పడుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వాకర్స్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వైల్డ్‌లైఫ్ మాడల్ సఫారీని సంద‌ర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here