శేరిలింగంపల్లి, జనవరి 2 (నమస్తే శేరిలింగంపల్లి): నూతన సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, అందరికి మంచి జరగాలని భారాస పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఆకాంక్షించారు. కొత్త ఏడాది అందరికి లాభదాయకంగా ఉండాలన్నారు. భగవంతుడు అందరిని మంచిగా చూడాలని వేడుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్ లో భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన రవీందర్ యాదవ్.. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను కేటీఆర్ అభినందించారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని, సామాన్యులకు అండగా నిలబడాలని సూచించారని ఆయన తెలిపారు. అనంతరం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో రానుంది భారాస ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలు కోరుకోవడం లేదన్నారు. కేసీఆర్ పదేళ్ల పాటు చేసిన సంక్షేమాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారని వెల్లడించారు.