హలో కిడ్స్ ఫిలాసఫీ Pre స్కూల్ ను ప్రారంభించిన రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, మే 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ వినాయక్ నగర్ రోడ్ లో హలో స్కూల్ కరస్పాండెంట్ ప్రసూన-బుచ్చయ్య గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు రవి కుమార్ యాదవ్ హాజరై స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచర్స్ బృందం అత్యంత అనుభవిజ్ఞులై ఉండి పిల్లల పట్ల అంకితభావం కలిగిన వారై ఉండాలి. వారు కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా, పిల్లలతో స్నేహంగా ఉంటూ, వారి సందేహాలను తీరుస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, ఆటపాటలతో కూడిన ఆహ్లాదకరమైన బోధన‌ అందించినట్లయితే, పిల్లలు నేర్చుకోవడం ఒక భారంగా కాకుండా ఒక ఆనందంగా పాఠాలు నేర్చుకుంటారని అన్నారు. స్కూల్ యాజమాన్యం ఫీజుల నియంత్రణ పద్ధతి పాటిస్తూ తల్లిదండ్రులపై భారం మోపకుండా ఒక నిర్దిష్టమైన ఫీజులను వసూలు చేయాలని రవి కుమార్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్ కేశవ వీరమల్లు, సీనియర్ నాయకుడు మహేష్ యాదవ్, అధ్యక్షులు జితేందర్, లక్ష్మణ్, గణేష్, మహేందర్, నరేందర్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here