శేరిలింగంపల్లి, నవంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): పాపిరెడ్డి నగర్ రాజీవ్ గృహకల్ప సెంటర్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఆర్ .కే. వై. టీం సభ్యుడు శ్రీకాంత్ నూతనంగా ప్రారంభించబోతున్న కృతిక ఫుడ్స్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్ హాజరై హోటల్ ప్రారంభించారు. లాభాపేక్ష లేకుండా, పరిశుభ్రత, నాణ్యత పాటించి మంచి లాభాలు గడించి అంచలంచెలుగా వ్యాపార అభివృద్ధి చెందాలని నిర్వాహకులకు సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, విజయలక్ష్మి, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.