శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేటకు చెందిన హనుమంత్ అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ ఎల్‌వోసీ పత్రాలను బాధిత కుటుంబానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అందజేశారు. సీఎం సహాయనిధి ఆపదలో ఉన్న పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పేదలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.