నమస్తే శేరిలింగంపల్లి: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కేసీఆర్ ప్రభుత్వం పేద ముస్లింలకు రంజాన్ బట్టలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని చిన్న అంజయ్య నగర్ లో బిలాల్ మజీద్ వద్ద ముస్లిం మహిళలకు స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ రంజాన్ పండగ తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. ముస్లిం మైనార్టీ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్ధేశ్యంతో రంజాన్ తోఫాను అందజేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నయీమ్, అజ్మత్ ఖాన్, జాంగిర్ అప్ప, పత్రు బాయ్, అబ్దుల్ బాయ్, రాజు నాయక్, గోపాల్ యాదవ్, లక్ష్మణ్ యాదవ్, బస్వరాజ్, స్థానిక నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
