నమస్తే శేరిలింగంపల్లి: ఆపదలో ఉన్న వారికి అండగా మేమున్నాం అంటూ పలు సామాజిక సేవా కార్యక్రమాలతో అవని చారిటబుల్ ఆర్గనైజేషన్ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గురు ముస్లిం బాలికల విద్య కోసం రూ. 15 వేల ఆర్థిక సహాయం అందజేశారు. పాఠశాలలో చదువుతున్న ముగ్గురు పేద ముస్లిం బాలికల విద్యాభ్యాసం కోసం స్కూల్ ఫీజు చెల్లించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అవని చారిటబుల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్ మాట్లాడుతూ ముఖ్యంగా బాలికల విద్య కోసం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. మున్ముందు మరెన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు.