ముస్లింల అభ్యున్నతికి ‌కేసీఆర్ కృషి – ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాను అందజేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తుందని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. ప‌విత్ర రంజాన్ మాసం సందర్భంగా లింగంపల్లి టీటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిన రంజాన్ తోఫా ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ స్వరాష్ట్రంలో పేద ముస్లింలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, అన్ని కులాలు, మతాలను సమానభావంతో చూస్తున్న దమ్మున్న సెక్యులర్‌ నాయకుడు సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఎంతోమంది పేద ముస్లిం విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. సమాజంలో గౌరవం పెరిగేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి ముస్లిం ప్రజలు అండగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ నల్లా సంజీవరెడ్డి, శేరిలింగంపల్లి జనరల్ సెక్రెటరీ మహమ్మద్ వాహీద్ అలీ, లింగంపల్లి రైల్వేస్ ఎస్ఐ ధారాసింగ్, ఏఎస్ఐ స్వామి, లింగంపల్లి రైల్వే స్టేషన్ సెక్రటరీ కె.వి. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్లు యూసఫ్, ఫిరోజ్, బురాన్, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు రంజాన్ బట్టలను అందజేస్తున్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం‌ నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here