రామకృష్ణ నగర్ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడ లోని రామకృష్ణ నగర్ కాలనీలో కాలనీ వాసులతో సోమవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమావేశమయ్యారు. పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై చర్చించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ రామకృష్ణ నగర్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధి కి పాటుపడాలని సూచించారు. కాలనీలో రోడ్లు మరమ్మతులు చేపట్టాలని , మంచి నీటి సమస్యను పరిష్కరించాలని,  డ్రైనేజీ,  వీధి దీపాల సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ పూర్ణేశ్వరి, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు ఉమామహేశ్వరరావు, బాలయ్య, సురేందర్, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రసాద్, నాగేశ్వరరావు, శ్రీధర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

రామకృష్ణ ‌నగర్ కాలనీ వాసులతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here