హెచ్‌సీయూలో ఎంటెక్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య – మాన‌సిక ఒత్తిడే కార‌ణం..?

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హైద‌రాబాద్‌సెంట్రల్ యూనివర్సిటీలో ఎంటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పెద్దప‌ల్లి జిల్లా శ్రీరాం పూర్ మండ‌లం తారేప‌ల్లికి చెందిన మౌనిక హెచ్‌సీయూలో ఎంటెక్(నానో సైన్స్‌) చ‌దువుతుంది. లేడీస్ హాస్ట‌ల్ నెం.1లో నివాసం ఉంటుంది. ఆదివారం మౌనిక బ‌య‌ట‌కు రాలేదు. సోమవారం సాయంత్రం వ‌ర‌కు బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో స్నేహితులు ఆమె ఫోన్‌కు కాల్ చేశారు. స్పందించ‌క‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి సెక్యూరిటీ సిబ్బంది స‌హ‌కారంతో త‌లుపు బ‌ద్ద‌లుకొట్టారు. గ‌దిలో మౌనిక ఉరికి వేళాడుతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఐతే ఘ‌ట‌నా స్థ‌లంలో మౌనిక రాసిన సూసైడ్ నోట్ ల‌భించిన‌ట్టు తెలుస్తుంది. తీవ్ర మాన‌సిక ఒత్త‌డి వ‌ల్లే బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డుతున్న‌ట్టు పేర్కొన‌ట్టు స‌మాచారం. మౌనిక ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి పూర్తి వివ‌రాలు విచార‌ణ పూర్త‌య్యాక పోలీసులు దృవీక‌రించాల్సి ఉంది. కాగా మౌనిక మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా వైద్య‌శాల‌కు త‌ర‌లించారు.

మౌనిక(ఫైల్‌)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here