శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): త్యాగం ,దయ ,సానుభూతి, క్రమశిక్షణ, దానాగుణాలను నేర్పే పవిత్ర రంజాన్ మాసం చివరి రోజు ఈద్ – ఉల్- ఫితర్ సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని అపర్ణ గార్డెనియాలోని సీనియర్ నాయకుడు అన్వర్ షరీఫ్ నివాసంకు కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి వెళ్లి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పవిత్ర మాస రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రవీందర్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నాయకులు మారబోయిన రాజు యాదవ్, మిరియాల రాఘవరావు, జనార్దన్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, ఓ వెంకటేష్, చింత కింది రవీందర్ గౌడ్, నరేందర్ బల్లా, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, మహేందర్, రాజు యాదవ్, సందీప్ రెడ్డి, యశ్వంత్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.