శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్న బియ్యం అందించాలని గొప్ప ఆలోచన చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, ప్రశాంత్ నగర్ కాలనీ, జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలలో రేషన్ దుకాణలలో స్థానిక నాయకులతో కలసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది పర్వదినాన రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడం తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ విషయమని అన్నారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని, పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయమని,ఈ పథకం ద్వారా తెలంగాణలో నిరుపేదలందరికీ లబ్ది చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు లక్ష్మయ్య గౌడ్, తిమ్మరాజు, శ్రీను, వెంకటేష్ గౌడ్, నరేష్ నాయక్, జ్యోతి, రాణి, వెంకటేష్, రాజు గౌడ్, విజయ్, శ్రీనివాస్, తిరుపతి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.





