నమస్తే శేరిలింగంపల్లి: దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్‌పార్టీ శేరిలింగంపల్లి సమన్వయకర్త రఘునందన్‌రెడ్డి ఆద్వర్యంలో గంగారం హుడాకాలనీలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాహనదారులకు, పాదచారులకు మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ భారతీదేశ అభివృద్ధిలో రాజీవ్‌గాంధీ పాత్ర మరిచిపోలేనిదని, సూర్యచంద్రులున్నంత వరకు ఆయన కిర్తీ కొనసాగుతుందని అన్నారు. నివాళులర్పించిన వారిలో ఆ పార్టీ కంటెస్టెండ్ కార్పొరేటర్లు ఇలియాస్ షరీఫ్, మారెళ్ల శ్రీనివాస్, టీపీసీసీ మైనారిటి వైస్ చైర్మన్ అయాజ్ అహ్మద్‌ఖాన్, మహ్మద్ జహాంగీర్ శేరిలింగంపల్లి మైనారిటీ చైర్మన్, నాయకులు రంగారెడ్డి, నారాయణ, సునిల్, సలీం తదితరులు పాల్గొన్నారు.
