నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్‌పేట్‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సైబరాబాద్ డీసీపీ డాక్టర్ లావణ్య చేయూతనందించారు. ఆరోగ్య కేంద్రం సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు, ఫేస్‌షీల్డ్‌లు అందజేశారు. స్థానియ లయన్స్‌క్లబ్ ప్రతినిధి అమర్‌సింగ్‌తో కలిసి శుక్రవారం హఫీజ్‌పేట్ ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ వినయ్‌బాబుకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్ కష్టకాంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది శక్తి వంచనలేకుండా కృషిచేస్తూన్నారని, ఐతే రక్షణ విషయంలో వారికి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో పాటు ఇతరుల చేయూత ఎంతో అవసరమని అన్నారు. ఈ క్రమంలోనే హఫీజ్‌పేట్ ఆరోగ్యకేంద్రం సిబ్బందికి తమ వంతుగా తోచిన సహకారం అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్యారామెడికల్ ఆఫీసర్ ఏ.రమేష్‌నాయక్, సిబ్బంది, లయన్స్‌క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.