హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్‌లో ప్రైవేట్ ఉపాధ్యాయుల‌కు ప్ర‌భుత్వం నుంచి స‌న్న‌బియ్యం… పంపిణీ చేసిన బాలింగ్ గౌత‌మ్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: క‌రోనా కారణంగా స‌రైన ఉపాధి లేక అవ‌స్థ‌లు ప‌డుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ద్వారా మంజూరైన స‌న్న‌బియ్యాన్ని హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్‌లో మంగ‌ళ‌వారం పంపిణీ చేశారు. స్థానిక సాయిన‌గ‌ర్ రేషన్‌షాపులో డివిజ‌న్ టీఆర్ఎస్ అధ్య‌క్షుడు బాలింగ్ గౌత‌మ్ గౌడ్ ల‌బ్ధిదారుల‌కు బియ్యం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ క‌రోనా కార‌ణంగా గ‌త ఏడాది కాలంగా స‌రైన ఉపాధి స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్రైవేట్ పాఠ‌శాల‌ల ఉపాధ్యాయుల బాద‌ల‌ను గుర్తెరిగి సీఎం కేసీఆర్ వారికి రూ.2 వేల చొప్పున న‌గ‌దుతో పాటు ఉచితంగా స‌న్న‌బియ్యాన్ని పంపిణీ చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఏరంగం వారైనా క‌ష్టంలో ఉంటే వారిని గుర్తించి తోచిన స‌హ‌కారం అందిచ‌డంలో కేసీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.

 

ల‌బ్ధిదారుల‌కు స‌న్న‌బియ్యం అంద‌జేస్తున్న బాలింగ్ గౌత‌మ్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here