నమస్తే శేరిలింగంపల్లి:గచ్చిబౌలి డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దేలా కృషి చేస్తామని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం లో ప్రజా సమస్యలపై బస్తీ బాట కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ లో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై తనిఖీ చేశారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలపై జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ కోశాధికారి సతీష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ శివ సీనియర్ నాయకులు నరసింహ రావు, దుర్గారామ్, కాలనీ వాసులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
