నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్, మాదాపూర్ డివిజన్లలోని ప్రతి కాలనీ, బస్తీ అభివృద్ధికి కృషి చేస్తామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న మంజీర పైప్ లైన్ పనులను స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు. పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంజీర పైప్ లైన్ వద్ద నూతనంగా చేపట్టాల్సిన సీసీ రోడ్డు అభివృద్ధి పనులపై నాయకులతో కలిసి సమీక్షించారు. దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శవంతమైన డివిజన్లుగా మారుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, జార్జ్, వెంకటేష్, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
