నమస్తే శేరిలింగంపల్లి: నకిలీ డాక్యుమెంట్లు చూపించి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించి మోసం చేసిన ఓ ఈ పేపర్ సీఈఓను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం కలం నిఘా ఈ న్యూస్ పేపర్ సీఈఓ మందా రాజేష్ అనే వ్యక్తి రిటైర్డ్ ఎస్ బీ ఐ ఉద్యోగి అయిన సత్యనారాయణకు నకిలీ డాక్యమెంట్లు చూపించి అతని పేరు మీద ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకునేలా ప్రేరిపించి రూ. 1.6 కోట్లు వసూలు చేశాడు. ప్లాట్ల విషయంలో మోసం పోయినట్లు తెలుసుకున్న బాదితుడు సత్యనారాయణ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మందా రాజేష్ పై కేసు నమోదు (నం 154/2020) చేసిన పోలీసులు అరెస్టు చేశారు. కాగా గతంలో రాజేష్ పై మరో 8 కేసులతో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.