నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లలోని పట్టణ ప్రాథహిక ఆరోగ్య కేంద్రాలను కార్పొరేటర్లు వి.గంగాధర్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నే శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలతో కలసి ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు అమోఘఅని, అతి త్వరలోనే రాయదుర్గం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ సెంటర్‌ణు ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అన్నారు. ప్రజా అవసరాల దృష్ట్యా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని, ప్రయివేట్ హాస్పిటల్స్‌కి దీటుగా అన్ని హంగులతో, సకల సౌకర్యాలతో ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజల సౌకర్యార్థం వ్యాక్సినేషన్ కార్యక్రమంను వేగవంతం చేయాలని, డోస్‌ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఇప్పుడు నడుస్తున్న వ్యాక్సినేషన్ సెంటర్లతో పాటు నియోజకవర్గ పరిధిలోని అన్ని బస్తి దవాఖానాలతోపాటు మరిన్ని అదనపు వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళుతా అన్నారు.
ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజా అవసరాల రీత్యా ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న మరిన్ని బస్తి ధవాఖానాలు త్వరితగతిన ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వ్యాక్సినేషన్ సెంటర్ల లో వ్యాక్సిన్ డోస్‌ల సంఖ్యను మరింత పెంచాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వసతులు, సౌకర్యాల గూర్చి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని, ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటామని, ఎటువంటి సహాయ సహకారాలు అందించాడనికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. అదేవిధంగా కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యత గా ఉండలాని, వైరస్‌వ్యాప్తి చెందకుండా బయటికి వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు భౌతికదూరం తప్పక పాటించాలని, శానిటైజర్లను ఉపయోగించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ఏఎంఓహెచ్ డాక్టర్ రవి, హఫీజ్‌పేట్ ఆరోగ్య కేంద్రం వైధ్యాధికారి డాక్టర్ వినయ్‌బాబు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, హపీజ్‌పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, నాయకులు దారుగుపల్లి నరేష్, సంపత్ కుమార్, జగదీష్, కృష్ణ ముదిరాజ్, నరేంద్ర ముదిరాజ్, కృష్ణ యాదవ్, నరేంద్ర యాదవ్, దయాకర్ మల్లేష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.