నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలో కరోనా నియంత్రణలో భాగంగా స్థానిక కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆదేశాల మేరకు డీఆర్ఎఫ్ గురువారం పలు కాలనీల్లో శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. జవహార్ కాలనీ, సాయిరాఘవ, జీఎన్ఆర్ ఎన్‌క్లేవ్‌లలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్న పిచికారి చేశారు. డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి శానిటేషన్ డ్రైవ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ ప్రజలు ధైర్యంగా ఉండి కరోనాతో పోరాటం సాగించాలని, ఏ ఇబ్బందులు తలెత్తినా తాము అండగా ఉంటామని అన్నారు. కాగా సకాలంలో స్పందించి శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టినందుకు స్థానికులు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గురుచరణ్ దూబే, కృష్ణ దాస్, గోవర్ధన్‌రెడ్డి, కిరణ్, రమేష్, రవిచంద్రారెడ్డి, ప్రసాద్, భవానీ, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
