శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 4 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలోని రవీంద్రభారతిలో 17 కళలతో 190 మంది కళాకారులతో హైదరాబాద్ జిందాబాద్ పేరిట సాంస్కృతిక ప్రదర్శనలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన డాక్టర్. బి. యల్. ఎన్ రాజు మల్టి టాలెంట్ ఇంటర్నేషనల్ మేజిషియన్ మ్యాజిక్ ప్రదర్శన ప్రేక్షకులని అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులందరూ ఆయనకు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.